టీడీపీకి షాక్:వైసీపీలోకి వేనాటి

By Nagaraju TFirst Published Dec 2, 2018, 2:56 PM IST
Highlights

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బే తగిలింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కుటుంబం నుంచి ఒక వికెట్ పడింది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 3 సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు ఆ యువనేత.  

నెల్లూరు: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బే తగిలింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కుటుంబం నుంచి ఒక వికెట్ పడింది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 3 సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు ఆ యువనేత.  

సూళ్లూరు పేట నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటున్నకుటుంబం వేనాటి కుటుంబం. వేనాటి సోదరులు టీడీపీలో కీలక  పాత్ర పోషిస్తున్నారు. టీడీపీలో మునిరెడ్డి తర్వాత ఆయన సోదరుడు రామచంద్రారెడ్డి టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రామచంద్రారెడ్డి జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ గా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

రామచంద్రారెడ్డి కుమారుడు సూళ్లూరుపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఆయన నెల్లూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తుండగా సుమంత్ రెడ్డి కలిశారు. దీంతో సుమంత్ రెడ్డి వ్యహారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తండ్రి టీడీపీలో ఉంటే తనయుడు వైసీపీ అధినేతతో మాటలేంటని నిలదీసింది. 

ఈ నేపథ్యంలో జగన్ అంటే తనకు అభిమానమని జగన్ కు ఉన్న విజన్ తనకు ఎంతో నచ్చిందని సుమంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి యువకుడు సీఎం అయితే రాష్ట్రం ఎంతో బాగుంటుందని కితాబు ఇచ్చాడు. అంతేకాదు మంత్రి నారాయణ పై కూడా విమర్శలు చేశారు.

ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 

వేనాటి రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఆశించారు. అయితే అనూహ్యంగా ఆ పదవిని వేరొకరు తన్నుకుపోయారు. పోనీ తనయుడు సుమంత్ రెడ్డి సూళ్లూరుపేట మున్సిపల్ వైస్‌ చైర్మన్‌ పదవి వస్తుందని ఆశించారు. అది కూడా దక్కలేదు. 

ఆఖరికి రూ.150 కోట్లతో సూళ్లూరుపేట పట్టణ దాహార్తిని తీర్చేందుకు రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తే అది ఎటూ కదలకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమంత్ రెడ్డి జనవరి 26న టీడీపీకి, మున్సిపల్ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి వేచి చూస్తున్న ఆయన సోమవారం వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి శ్రీకాకుళం జిల్లాలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

click me!