
వేమూరు రాజకీయాలు :
వేమూరు నియోజకవర్గంపై టిడిపికి మంచి పట్టువుందని గత ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. 1982 లో టిడిపి ఆవిర్భావంతో కాంగ్రెస్ ను వీడిన నాదెండ్ల భాస్కరావు వేమూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ కేబినెట్ ఆర్థికమంత్రిగా పనిచేసారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి నెలరోజులు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా నెలరోజుల ముఖ్యమంత్రిని ఉమ్మడి రాష్ట్రానికి అందించిన ఘనత వేమూరుకు దక్కుతుంది.
నాదెండ్ల తరువాత కూడా వేమూరులో టిడిపి హవా కొనసాగింది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో నక్కా ఆనంద్ బాబు రెండుసార్లు (2009, 14) బరిలోకి దిగి గెలిచారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని ఓడించి వైసిపి జెండాను వేమూరుపై ఎగరేసారు మేరుగ నాగార్జున.
వేమూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
వేమూరు
కొల్లూరు
సుందూర్
భట్టిప్రోలు
అమృతలూరు
వేమూరు అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం)
వేమూరు నియోజకవర్గంలో మొత్తం 195274 ఓట్లు నమోదయ్యాయి.
ఇందులో పురుషులు - 95,339
మహిళలు - 99,929
వేమూరు నియోజకవర్గ ఎన్నికలు 2024 - ప్రధాన పార్టీల అభ్యర్థులు :
వైసిపి - వరికూటి అశోక్ బాబు (సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జునకు మరోసారి అవకాశం ఇవ్వలేదు)
టిడిపి - నక్కా ఆనంద్ బాబు (గతంలో రెండుసార్లు వేమూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకే మరోసారి అవకాశం ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు)
వేమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
వేమూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,95,274
పోలైన ఓట్లు - 1,71,618 (87 శాతం)
వైసిపి - మేరుగ నాగార్జున - 81,671 (47 శాతం) - 9,999 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - నక్కా ఆనంద్ బాబు - 71,672 (41 శాతం) - ఓటమి
జనసేన - అప్పికట్ల భరత్ భూషణ్ - 13,038 (7 శాతం)
వేమూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,85,485
పోలైన ఓట్లు - 1,58,723 (85 శాతం)
టిడిపి - నక్కా ఆనంద్ బాబు - 77,222 (48 శాతం) - 2,127 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - మేరుగ నాగార్జున - 75,095 (47 శాతం) - ఓటమి