టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

Published : Mar 09, 2024, 03:01 PM IST
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఆ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.

ఎట్టకేలకు టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు అయ్యింది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టు అయ్యింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇది వరకే ఉండగా.. బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్ సభ స్థానాలు, జనసేనకు 2 లోక్ సభ స్థానాలు కేటాయించారు. 

ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అమిత్‌షాతో చంద్రబాబు చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే సాయంత్రం ఈ పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వైజాగ్ కి రానున్న అతిపెద్ద కంపెనీలు మంత్రి లోకేష్ కీలక సమావేశం | Nara Lokesh South Korea Tour
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు