వైఎస్ఆర్‌సీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

By narsimha lode  |  First Published Feb 21, 2024, 4:54 PM IST

వైఎస్ఆర్‌సీపీకి  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు.



నెల్లూరు: వైఎస్ఆర్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  బుధవారం నాడు రాజీనామా చేశారు.గత కొంత కాలంగా  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై  అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ కారణంగానే  ఆయన వైఎస్ఆర్‌సీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టుగా  ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎంపీ పదవికి కూడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆయన  పార్టీ నాయకత్వాన్ని కోరారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  తెలుగు దేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. కొందరు తెలుగు దేశం పార్టీ నేతలు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం కూడ సాగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన  వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు తెలుగుదేశం వైపునకు వెళ్లారు. గత ఏడాది జరిగిన  ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా  ఓటు చేశారని  ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఉండవల్లి శ్రీదేవిపై కూడ వైఎస్ఆర్‌సీపీ సస్పెన్షన్ వేటేసింది. వీరిపై  అనర్హత వేటేయాలనికూడ   ఆ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. 

Latest Videos

click me!