ముగిసిన దసరా సెలవులు.. దారులన్నీ హైదరాబాద్ వైపే, విజయవాడ హైవేపై భారీ రద్దీ

Siva Kodati |  
Published : Oct 09, 2022, 02:24 PM IST
ముగిసిన దసరా సెలవులు.. దారులన్నీ హైదరాబాద్ వైపే, విజయవాడ హైవేపై భారీ రద్దీ

సారాంశం

హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు బారులు తీరారు. దసరా సెలవులు ముగియడంతో నగరానికి తిరిగివస్తున్నారు ప్రజలు. టోల్ వసూలు కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు బారులు తీరారు. దసరా సెలవులు ముగియడంతో నగరానికి తిరిగివస్తున్నారు ప్రజలు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణీకులు భాగ్యనగరానికి పయనం కావడంతో ఏపీలోని కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు.. తెలంగాణలోని చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీ నేపథ్యంలో టోల్ వసూలు కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu