అది పట్టదు గానీ జగన్ సినిమా చూస్తే మాత్రం...: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ

By telugu teamFirst Published May 4, 2019, 1:36 PM IST
Highlights

ప్రజలు తీర్పు అర్థమయ్యే చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫణి తుపానును జాగ్రత్తగా తానే పక్కకు తప్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. టీటీడీ వ్యవహారంపై స్పందించరు గానీ జగన్ సినిమాకు వెళ్తే మాత్రం స్పందిస్తారని ఆమె చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ సినిమాకు వెళ్తే కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

ప్రజలు తీర్పు అర్థమయ్యే చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫణి తుపానును జాగ్రత్తగా తానే పక్కకు తప్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తన పాపాలపుట్ట బద్దలవుతుందన్న భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. 

ఐదేళ్లలో చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం సాధించారని, కనీసం ఒక్క క్యాబినెట్ మీటింగ్ అయినా భూకేటాయింపులు లేకుండా జరిగిందా అని ప్రశ్నించారు. అలాంటిది మరి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారని అడిగారు. మీ మంత్రులు దాక్కున్నారా అని ఆమె ప్రశ్నించారు. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ కనబడటం లేదని అన్నారు. వారంతా చంద్రబాబు రోత చూసి విసిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. 

ఓడిపోతామనే తెలిసి వాళ్లంతా సొంత పనుల్లో ఉన్నారని అన్నారు. ఐదేళ్లుగా అవినీతి, అరాచకాలు చేసి... ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌ నవ్వినా చంద్రబాబు ఏడుస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌కు జీవించే హక్కు లేకుండా చంపాలని చూశారు. కనీసం ఆయనకు సినిమాకు వెళ్లే హక్కు కూడా లేదా అని అడిగారు. 

మీ లోకేష్ ఎక్కడున్నారో చెప్పాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు. కోడెల ఎదుర్కొన్న పరిస్థితి మరే టీడీపీ నేతలు తెచ్చుకోవద్దని అన్నారు.

click me!