navratri 2021 : 5 కోట్ల కరెన్సీ, 7 కిలోల బంగారం, 60 కిలోల వెండితో ముస్తాబైన వాసవీమాత ఆలయం.. ఎక్కడంటే..

Published : Oct 12, 2021, 08:54 AM IST
navratri 2021 : 5 కోట్ల కరెన్సీ, 7 కిలోల బంగారం, 60 కిలోల వెండితో ముస్తాబైన వాసవీమాత ఆలయం.. ఎక్కడంటే..

సారాంశం

Dussehra Sharanavaratri మహోత్సవాల్లో భాగంగా  నుడా చైర్మన్,  ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి  దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదో రోజు సోమవారం  శ్రీవాసవికన్యకా పరమేశ్వరి అమ్మవారిని,  ఆలయాన్ని  ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ. 3.5 కోట్ల విలువైన 7 కిలోల  బంగారు బిస్కెట్లు, రూ. 3.5 కోట్ల విలువైన  60 కిలోల వెండి బిస్కెట్లు,  ఆభరణాలతో అలంకరించారు.

నెల్లూరు : దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కొలవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. అలా నెల్లూరు బృందావనంలో కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు... కిలోల కొద్ది బంగారు,  వెండి బిస్కెట్లు.. విద్యుత్ దీప కాంతులతో సింహపురి సీమలో ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ పూజలు అందుకుంటున్నారు. 

Dussehra Sharanavaratri మహోత్సవాల్లో భాగంగా  నుడా చైర్మన్,  ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి  దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదో రోజు సోమవారం  శ్రీవాసవికన్యకా పరమేశ్వరి అమ్మవారిని,  ఆలయాన్ని  ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ. 3.5 కోట్ల విలువైన 7 కిలోల  బంగారు బిస్కెట్లు, రూ. 3.5 కోట్ల విలువైన  60 కిలోల వెండి బిస్కెట్లు,  ఆభరణాలతో అలంకరించారు.

ఇందుకోసం మహబూబ్నగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరి చంద్రశేఖర్  నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి  ఆలయానికి  మరింత శోభను సంతరింపచేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు.  ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్