నేటి నుంచి ఈ నెల 14 వరకు కుప్పంలో chandrababu naidu పర్యటన కొనసాగాల్సి ఉంది. నియోజకవర్గంలో పలు సమావేశాల్లో పాల్గొనడంతోపాటు బుధ, గురు వారాల్లో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, rains నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది.
అమరావతి : తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. వర్షాల వల్ల తమ అధినేత పర్యటన వాయిదా పడినట్టు చిత్తూరు జిల్లా కుప్పం TDP నేతలు తెలిపారు.
నేటి నుంచి ఈ నెల 14 వరకు కుప్పంలో chandrababu naidu పర్యటన కొనసాగాల్సి ఉంది. నియోజకవర్గంలో పలు సమావేశాల్లో పాల్గొనడంతోపాటు బుధ, గురు వారాల్లో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, rains నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది.
కాగా, చంద్రబాబు కుప్పంలోమూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఇంతకుముందే ఖరారైంది. తొలిరోజు మధ్యాహ్నం కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ కు చేరుకుని.. 3.30గంటలకు బస్టాండులో బహిరంగ సభ.. సాయంత్రం 4.30 గంటలకు కుప్పం మాజీ సర్పంచ్ గోపినాథ్ ఇంటికెళ్లి ఆయన కుమారుడు, కోడలును ఆశీర్వదిస్తారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కుప్పం మాజీ సర్పంచ్ దయాసాగర్ కుటుంబీకుల పరా మర్శ.. 5.15 గంటలకు కుప్పంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమావేశం ఉంటుందని చంద్రబాబు పీఏ మనోహర్ తెలిపారు.
ఈ పర్యటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు busలో బస చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన బస్సులోనే బస చేయడానికి కారణముందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 24, 25, 26 తేదీల్లో కుప్పం పర్యటన సందర్భంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌసులో చంద్రబాబు బస చేశారు. 25న తెల్లవారుజామున 4నుంచి 5 గంటల వరకు.. ఉదయం 7.30 నుంచి 8.30గంటల వర కు గెస్ట్‌హౌసులో కరెంటు సరఫరా ఆపేశారు. తద్వారా ఆయన నిద్రకు, స్నానానికి ఇబ్బంది కలిగించారు.
అత్యాచార నిందితులను పట్టుకోకుండా... బాధితులదే తప్పని చేతులు దులుపుకోవడం అన్యాయం: నారా లోకేష్
ఉద్దేశపూర్వకంగా కరెంటును కట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో పాటు గదిని శుభ్రం చేయకపోవడం, బెడ్డు కింద బిర్యాని ముక్కలు, కప్‌బోర్డులో మందు బాటిళ్ల మూతలు ఉండటంతో అధికారులపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఈ చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి బస్సులోనే బస చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఆవరణలో బస్సు ఆపి, అందులోనే నిద్ర, స్నానం, భోజనం చేస్తారు. నాయకులతో సమావేశాలను మాత్రం అతిథి గృహంలో నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు పర్యటన వాయిదా పడింది.