గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని వల్లపాడుకు చెందిన గోపి అనే యువకడిని హత్య చేశారు. గోపి ఓ యువతిని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహరంలోనే హత్యకు గురైనట్టుగా మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు: guntur జిల్లా vatticherukuru మండలంలోని పల్లపాడుకు చెందిన bandaru gopi అనే యువకుడు మృతి చెందాడు. love వ్యవహరంలోనే గోపి murderకు గురయ్యారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
also read:హైదరాబాద్: అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించి... అల్లుడి హత్యాయత్నం
గోపి ఓ యువతిని ప్రేమించాడు.ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది. ఈ ప్రేమ విషయం యువతి ఇంట్లో నచ్చలేదు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కిరాయి హంతకులతో గోపిని హత్య చేసినట్టుగా మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల నుండి గోపి అదృశ్యమయ్యాడు. గోపి కోసం కుటుంబసభ్యులు గాలించారు. అయినా కూడ అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గోపి కుటుంబ సభ్యులు. గోపి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే గోపి హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.తమ కొడుకును హత్య చేయించి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.గోపి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోొపిని ఎవరు హత్య చేసి ఉంటారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.