తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై

Published : Aug 29, 2019, 08:16 PM IST
తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత వరుపుల రాజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల అసెంబలీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఓటమి పాలైన రాజా.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత వరుపుల రాజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల అసెంబలీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఓటమి పాలైన రాజా.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

రాజీనామా సందర్భంగా రాజా మాట్లాడుతూ.. టీడీపీ మునిగిపోతున్న నావ లాంటిదన్నారు. పార్టీకి ఏపీలో మనుగడ కష్టమేనని అభిప్రాయపడ్డారు. కాపులకు తెలుగుదేశంలో గుర్తింపు ఉండటం లేదని.. మొదటి నుంచి కూడా బాబు కాపు సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని రాజా ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కితాబిచ్చారు. జగన్ పాలనను పొగడటం ద్వారా రాజకీయంగా తన అడుగులు ఎటు వైపు వేయబోతున్నానో రాజా చెప్పకనే చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu