చిన్నారి వర్షిత హత్య: లైంగిక దాడి, హంతకుడు కర్ణాటకవాసి?

By telugu team  |  First Published Nov 10, 2019, 8:41 AM IST

పెళ్లింట జరిగిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. వర్షితపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.


చిత్తూరు: చిన్నారి వర్షితపై అత్యాచారం చేసిన హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం గుట్టపాళ్యం గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్యోదంతం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

కరబలకోట మండలం చేనేతనగర్ లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన వర్షిత హత్యపై ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం నివేదిక వివరాలను వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఊపిరాడకుండా చేశాడని, దానివల్లనే వర్షిత మరణించిందని పోలీసులు చెప్పారు. 

Latest Videos

undefined

Also Read: పెళ్లింట విషాదం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

గురువారం రాత్రి వివాహానికి వచ్ిచన ఆగంతకుడు ఓసారి పెళ్లి కొడుకు తరఫు బంధువునని, మరోసారి పెళ్లి కూతురు తరఫు మనిషినని పొంతన లేకుండా చెప్పాడని, మరి కొందరతితో పెళ్లి బస్సు సిబ్బందికి చెందినవాడినని చెప్పాడని వర్షిత కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో అతనే హంతకుడై ఉంటాడని అనుమానిస్తున్నారు. 

కల్యాణమండపంలో తిరుగాడిన హంతకుడి ఆనవాళ్లను సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు అతన్ని కర్ణాటకవాసిగా గుర్తించారు. దీంతో అతని సమాచారం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, కోలార్, కేజీఎఫ్ జిల్లాల్లోని డీసీఆర్ బీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హంతకుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు ఊహ చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపాలని పోలీసులు కోరారు. 

click me!