బంగారుపాళ్యంలో ఘటనపై డీజీపీకి లేఖ రాసిన వర్ల రామయ్య

By SumaBala BukkaFirst Published Feb 4, 2023, 11:55 AM IST
Highlights

బంగారుపాళ్యంలో నిన్న జరిగిన ఉదంతం మీద టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. దీనిమీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

బంగారుపాళ్యంలో ఘటనపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి మీరు నిర్ధేశించిన ప్రకారం స్థానిక పోలీసు అధికారులకు సక్రమంగా పనిచేయడం లేదు. కొంతమంది పోలీసు అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే విద్యుత్ నిలిపివేశారు. మూడు వాహనాలు సీజ్ చేశారు. డీఎస్సీ సుధాకర్ రెడ్డి నాయకత్వంలో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారు.

పోలీసులు వాలంటీర్లపై, తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, బండ బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. పలమనేరు ఇన్స్పెక్టర్ గజేంద్ర అనే యువగళం వాలంటీర్ పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. గజేంద్ర రక్తపు గాయాలతో కిందపడిపోయాడు. ఈ నేపద్యంలో అధికారపార్టీతో కుమ్మక్కై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోండి. అక్రమంగా సీజ్ చేసిన యువగళం వాహనాలను రిలీజ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించండి.. అని లేఖలో పేర్కొన్నారు. 

ఆరోజు కాకాణి ఏం చేశారో గుర్తులేదా?.. బెదిరింపు కాల్స్ వస్తే సజ్జలకు వీడియో కాల్స్ వెళ్తాయి: కోటంరెడ్డి

ఇదిలా ఉండగా, శుక్రవారం  సాయంత్రం నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర బంగారుపాళ్యం కూడలికి చేరుకుంది. అయితే ఈ సమయంలో బంగారుపాళ్యం కూడలిలో బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి కార్యకర్తలు ఓవైపు, వందలాది మంది పోలీసులు మరోవైపు.. చేరుకోవడంతో బంగారుపాళ్యం కూడలి వద్ద తోపులాట జరిగింది. సభ నిర్వహించేందుకు అనుమతి లేదని.. కేవలం ప్రజలతో ముఖాముఖి మాత్రమే నిర్వహించాలని పోలీసులు తెలిపారు.

అయితే టిడిపి కార్యకర్తలు మాత్రం ఎలాగైనా లోకేష్ బహిరంగ సభను  నిర్వహించాలని పట్టుపట్టారు. దీంతో లోకేష్ ప్రచార వాహనంపై నుంచే ప్రసంగించడానికి సిద్ధమవగా దీనిని పోలీసులు అడ్డుకున్నారు. అది గమనించిన టిడిపి నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసులు చుట్టుముట్టడంతో టిడిపి నేతలు, లోకేష్ బంగారుపాల్యం కూడలిలోనే ఓ భవనం పైకి ఎక్కారు.  అక్కడినుంచే లోకేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 

click me!