దళిత యువకుడి హఠాన్మరణం.. ఎస్సీ కమిషన్ కి వర్ల రామయ్య లేఖ

Published : Aug 27, 2020, 10:12 AM ISTUpdated : Aug 27, 2020, 10:14 AM IST
దళిత యువకుడి హఠాన్మరణం.. ఎస్సీ కమిషన్ కి వర్ల రామయ్య లేఖ

సారాంశం

సోషల్ మీడియాలో తన భావాలు వ్యక్తం చేసినందుకు అధికార పార్టీనేతలు బండ బూతులు తట్టారని.. కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టమని బెదిరించారని.. అందుకే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఆరోపించారు. 

సీఎం జగన్ పై విమర్శలు చేసిన యువకుడు హఠాన్మరణం చెందడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.  వైసీపీ నేతల బెదిరింపుల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ఘటనపై తాజాగా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఎస్సీ కమిషన్ కి  వర్ల రామయ్య లేఖ రాశారు.

దళితులపై దాడుల గురించి పదేపదే మీకు లేఖలు రాస్తున్నందుకు క్షమించాలని కోరుతూనే ఈ లేఖ రాయడం గమనార్హం. దళితుడు ఓం ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవాడినికి ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని వర్ల కోరారు.

సోషల్ మీడియాలో తన భావాలు వ్యక్తం చేసినందుకు అధికార పార్టీనేతలు బండ బూతులు తట్టారని.. కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టమని బెదిరించారని.. అందుకే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఆరోపించారు. రాష్ట్రంలో వరసగా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని.. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కొందరినేమో కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దళితులపై వరస దాడుల మిస్టరీని చేధించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం సోమల మండలం కామిరెడ్డివారిపల్లె పంచాయతీ బండకాడలోని దళితవాడకు చెందిన ఓం ప్రతాప్‌(32) పది రోజుల కిందట మదనపల్లెలోని ఒక మద్యం షాపులో బీరు బాటిల్‌ కొనుగోలు చే శారు. బాటిల్‌పై ధర రూ.140 ఉంటే షాపులో రూ.230కి విక్రయించారు. దీంతో ఓం ప్రతాప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరలను ఇంత భారీగా ఎందుకు పెంచుతున్నారంటూ షాపు ముందే నిలబడి సంబంధిత ప్రభుత్వశాఖలను ప్రశ్నించారు. అదేసమయంలో ఆవేశంలో సీఎం జగన్‌ను నిందించారు. ఈ నేపథ్యంలో ఓం ప్ర తాప్‌ స్నేహితులు ఈ విషయం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇదిలావుంటే, ఓం ప్రతాప్‌ సోమవారం హఠాత్తుగా మరణించడం తీవ్రకలకలం రే పింది.

సీఎం జగన్‌ను నిందించడం వల్లే వైసీపీ నేతలు బెదిరించారని, వారికి భయపడే ప్రతాప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ప్ర చారం జరగడంతో బుధవారం వెలుగు చూసింది. అయితే.. కుటుంబసభ్యుల వాదన మాత్రం మరోలా ఉందిద. అనారోగ్యం కారణంగానే చనిపోయాడని  చెబుతున్నారు. ఓం ప్రతాప్ ని ఎవరూ బెదిరించలేదని... ఆత్మహత్యకు పాల్పడలేదని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే