రేపటి నుండి వారాహి యాత్ర: ఇవాళే అన్నవరానికి పవన్ కళ్యాణ్

Published : Jun 13, 2023, 02:15 PM IST
రేపటి నుండి  వారాహి యాత్ర: ఇవాళే అన్నవరానికి పవన్ కళ్యాణ్

సారాంశం

ఈ నెల  14 నుండి పవన్ కళ్యాణ్  కత్తిపూడి నుండి వారాహి యాత్రను  ప్రారంభిస్తారు.  అయితే  ఇవాళ  అన్నవరానికి  పవన్ కళ్యాణ్  చేరుకుంటారు.

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  మంగళవారంనాడే  అన్నవరం చేరుకుంటారు.    రేపు  ఉదయం  వారాహి యాత్రను  ప్రారంభించనున్నారు.  వారాహి యాత్రకు  పోలీసులు అనుమతిని  ఇచ్చిన విషయం తెలిసిందే. 

రేపు కత్తిపూడి జంక్షన్  నుండి వారాహి యాత్రను  పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు.  ఇవాళ  అమరావతిలోని  పార్టీ కార్యాలయం నుండి అన్నవరానికి  పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.పవన్ కళ్యాణ్ అన్నవరం ఆలయానికి  చేరుకోనున్న  నేపథ్యంలో  అదనపు భద్రతను కల్పించాలని ఆలయ ఈఓ ఆజాద్   జిల్లా ఎస్పీని  కోరారు. పవన్ కళ్యాణ్ పర్యటన  నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తలకు  ఇబ్బంది లేకుండా  చర్యలు తీసుకోవాలని  కోరారు.

also read:పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి: జనసేన శ్రేణుల్లో జోష్

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  రెండు  రోజుల పాటు  వారాహి యాత్ర  నిర్వహించేలా  పవన్ కళ్యాణ్  ప్లాన్  చేశారు. ఈ యాత్ర విజయవంతం  చేసేందుకు గాను  ఏడు కమిటీలను  జనసేన  ఏర్పాటు  చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వచ్చే ఏడాదిలో  ఎన్నికలు  రానున్నాయి. అయితే  ఇప్పటికే  ఏపీలో  రాజకీయ వేడి రాజుకుంది,. పొత్తులు, ఇతర విషయాలపై  పార్టీల మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు  చోటు  చేసుకున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu