కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై స్టే కోరుతూ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ:కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరుతూ వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి వాదించారు. వైఎస్ సునీతారెడ్డికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా సహకరించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలో తెలంగాణ హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వైఎస్ సునీతా రెడ్డి వాదించారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను కూడ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అత్యున్నత న్యాయస్థంనం చెప్పిన అంశాలకు విరుద్దంగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైందని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీతారెడ్డి సుప్రీంలో వాదించారు. మూడుసార్లు సీబీఐ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని విషయాన్ని సునీతారెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వైఎస్ అవినాష్ రెడ్డ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని సునీతా రెడ్డి చెప్పారు.
undefined
తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపి అరెస్ట్ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి తప్పించుకున్నారని ఆమె వాదించారు. సీబీఐ అధికారులను ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతుదారులు అడ్డుకున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. సాక్షులను వైఎస్ అవినాష్ రెడ్డి , ఆయన మద్దతుదారులు బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. సీబీఐ అధికారులపై వైఎస్ అవినాష్ రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్ కు ముందే తెలిసిందని ఆమె ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా? విచారణఖు సహకరిస్తున్నారా? అ న్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెలవుల అనంతరం ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని బెంచ్ తెలిపింది. ఈ నెల 30వ తేదీలోపుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ముగించాలని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిన విషయాన్ని వైఎస్ సునీతా రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ లోపుగా ఈ పిటిషన్ పై విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆమె వాదించారు. ఒంకో ధర్మాసనం పెట్టిన డెడ్ లైన్ ను తాము మార్చలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది.
అయితే పిటిషనర్ కోరిక మేరకు ఈ కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ ఏడాది మే 31న ముందస్తు బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని ఈ ఏడాది మే 22న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ పై విచారణ ఈ నెల 13కి వాయిదా
ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు మే 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ నిర్వహించాలని ఆదేశించింది ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి ఈ నెల 7వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.