వంగవీటి రాధా పెళ్లి ముహుర్తం ఖరారు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు..

Published : Oct 08, 2023, 01:42 PM IST
వంగవీటి రాధా పెళ్లి ముహుర్తం ఖరారు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా పెళ్లి ముహుర్తం ఖరారు అయింది.  

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా పెళ్లి ముహుర్తం ఖరారు అయింది.  పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణిల కుమార్తె పుష్పవల్లిని వంగవీటి రాధా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక, సెప్టెంబర్ 3వ తేదీన వంగవీటి రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థం.. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిను ముహుర్తం ఖరారు అయింది. ఇందుకు సంబంధించిన వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈనెల 22వ తేదీన రాత్రి 7.59 గంటలకు పోరంకిలోని మురళి రిసార్ట్‌లోని వంగవీటి రాధాకృష్ణ- పుష్పవల్లిల వివాహం జరగనుంది. శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో నవ వధువరులు వంగవీటి రాధ, పుష్పవల్లి వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఇక, పుష్పవల్లి కుటుంబానికి కూడా రాజకీయ  నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి వంగవీటి అభిమానులతో పాటు భారీగా వీఐపీలు తరలివచ్చే అవకాశం ఉంది. 

ఇక, వంగవీటి రాధా 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించి తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నప్పటికీ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. రాధా ఈసారి కచ్చితంగా గెలుస్తారని ఆయన మద్దతుదారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu