తెనాలిలో వంగవీటి రంగా విగ్రహం తొలిగింపు.. ఉద్రిక్తత

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 11:06 AM IST
తెనాలిలో వంగవీటి రంగా విగ్రహం తొలిగింపు.. ఉద్రిక్తత

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాపునాడు వ్యవస్థాపకుడు వంగావీటి మోహనరంగా విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలిగించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాపునాడు వ్యవస్థాపకుడు వంగావీటి మోహనరంగా విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలిగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న కాపునాడు నేతలు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు.

ప్రభుత్వం తీరును తప్పుబట్టిన వారు రంగా విగ్రహాన్ని కూల్చివేసిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాపునాడు నేతలను శాంతింప జేసే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే