ఏపీ శకటంపై కూడా మోదీ అక్కసు.. చంద్రబాబు

Published : Jan 07, 2019, 11:00 AM IST
ఏపీ శకటంపై కూడా మోదీ అక్కసు.. చంద్రబాబు

సారాంశం

ఏపీ శకటంపై కూడా ప్రధాని మోదీ తన అక్కసు వెల్లగక్కారని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

ఏపీ శకటంపై కూడా ప్రధాని మోదీ తన అక్కసు వెల్లగక్కారని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. త్వరలో రిపబ్లిక్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రతి రాష్ట్రానికి చెందిన శకటాన్ని ఊరేగిస్తారు. ఈ సంవత్సరం మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని.. గాంధీ థీమ్ తో శకటం ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

అయితే.. ఈ థీమ్ తో ఏపీ తయారు చేసిన శకటం కేంద్రాన్ని మెప్పించలేకపోయింది. కాగా.. ఈ విషయంపై చంద్రబాబు స్పందించారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు ఇది ఒక పరాకాష్ఠ అంటూ ధ్వజమెత్తారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై లేఖ రాయాలని.. కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

ఏపీ అన్ని రంగాల్లో ముందజలో ఉందని.. అందుకే తమ రాష్ట్రంపై మోదీ అసూయ పెంచుకుంటున్నారని మండిపడ్డారు.   ఏపీ పేరు వినపడితేనే ఆయనకు అక్కసు పెరిగిపోతోందని.. ,రాష్ట్ర పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే