ఆమె వల్లే మీకు అధికారం... గుర్తుంటే ఆ ఒక్కటి చేయండి: వంగలపూడి అనిత డిమాండ్

By Arun Kumar PFirst Published May 2, 2020, 6:52 PM IST
Highlights

కరోనా వైరస్ నియంత్రణ చర్యలకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జగన్ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని టిడిపి నాయకురాలు అనిత డిమాండ్ చేశారు. 

విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న మహిళలకు ముఖ్యమంత్రి నమ్మకద్రోహం చేశారన్నారు. మార్చి నెల బియ్యంతో పాటు కేంద్రం ఇచ్చిన బియ్యం ఇచ్చారని.. ఈ నెల బియ్యం రెండు మూడు రోజులు ముందు ఇచ్చారన్నారు. 

ఇంకా అనిత మాట్లాడుతూ.. ''45 ఏళ్ల వయసుకే పెన్షన్ ఇస్తానని చెప్పి మాట్లాడితే నీ అమ్మ మొగుడు చెప్పాడంట అని ఒక మంత్రి ప్రశ్నిస్తారు. ఏదైనా విషయంపై గట్టిగా మాట్లాడితే ఎదురు దాడి లేదంటే బూతులు తిడుతున్నారు'' అని మండిపడ్డారు. 

'' మూడు వారాల క్రితం చెప్పిన మాస్కులు ఎక్కడ పంచుతున్నారో చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు'' అని అన్నారు. 

''మీ చెల్లి ద్వారా అధికారంలోకి వచ్చిన విషయం నీ మదిలో మెదులుతూ ఉంటే, మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. ప్రజలు చచ్చిపోతుంటే ప్రభుత్వానికి ఆదాయం పేరుతో వైన్ షాప్‌లో ఓపెన్ చేస్తారా..? రెండు వారాల్లో ఓపిక పట్టలేరా..? జే ట్యాక్స్ రావట్లేదని బాధ ఎక్కువ ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దశలవారీగా ఎందుకు? ఇప్పుడు ఎలాగూ అవకాశం వచ్చింది పూర్తిగా నిలిపివేయండి'' అని సూచించారు. 

ముఖ్యమంత్రి జగన్ కు కనీసం ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం చేతకాదు. అలాంటి వ్యక్తికి పరిపాలన సాధ్యం అవుతుందా.. లేదా? అని ప్రజల్లో భయం మొదలైంది’’ అని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

click me!