ఏపీ పోలీసులకు రెండు రెట్లు ఎక్కువ జీతాలివ్వాలి: యరపతినేని డిమాండ్

By Sree sFirst Published May 2, 2020, 5:47 PM IST
Highlights

ఈ కరోనా కట్టడి చేయడంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడిన పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళని ప్రభుత్వం ప్రత్యేక తరగతి క్రింద కేటాయించి గుర్తింపు ఇవ్వాలని గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డిమాండ్ చేసారు. 

ఈ కరోనా కట్టడి చేయడంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడిన పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళని ప్రభుత్వం ప్రత్యేక తరగతి క్రింద కేటాయించి గుర్తింపు ఇవ్వాలని గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డిమాండ్ చేసారు. అలాగే వాళ్ళందరికీ కూడా, వాళ్లకు ఎంత అయితే శాలరీ వస్తుందో దానికి డబుల్ శాలరీ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు యరపతనేని. 

అంతేకాకుండా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రమోషన్ విషయంలో కూడా ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఎవరైనా కరోనా బారిన పడిన వ్యక్తి ఉంటే ఆ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. 
పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ  10,000/- రూపాయలు అదనంగా ఇవ్వాలని, వాళ్లకు గత కొన్ని నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాళ్లకు వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. 

ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంటు కరోనా కట్టడి చేయడంలో ఎస్పీ దగ్గర నుండి కానిస్టేబుల్ వరకూ బాగా పని చేశారని, చాలా మంది ఇళ్లకు కూడా వెళ్లకుండా, కుటుంబాలను కూడా చూడకుండా, బయటనే ఉండి చాలా ఇబ్బందులు పడుతూ డ్యూటీలు చేశారని పోలీసుల సేవలను కొనియాడారు. ముఖ్యంగా  కానిస్టేబుల్ కుటుంబాలు, అదేవిధంగా మిగతా అధికారులు చాలా మంది పేద వర్గాల నుండి వచ్చిన వారే ఉన్నందున, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సవినయంగా విన్నవించారు. 

కరోనాని కట్టడి చేసే పని చేసినందుకు గానూ, ఈ కుటుంబాలకీ, వాళ్లకు ఇచ్చే నెల జీతంతో పాటు దానికి రెండు రెట్లు ఎక్కువ శాలరీని ప్రభుత్వం ఇవ్వాలని,  వీళ్ళ పిల్లలు ప్రైవేటు స్కూల్లో చదువుకుంటుంటే ఆ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

 ఎవరైనా పోలీసు కుటుంబాలలోని పిల్లలు ఇంజనీరింగ్ లోకాని, మెడిసిన్లో కానీ, మెరిట్లో సీటు వచ్చి కాలేజీలలో చేరాలంటే, ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లించాలని, పోలీసు కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 

వాళ్ళ ప్రమోషన్ల విషయంలో "అడ్ హక్  ప్రమోషన్లు మరియు యాక్సిల్లరీ ప్రమోషన్లు" వాళ్లకి ఇవ్వాలని, ఇంకా ఈ కరోనా కట్టడి అయ్యేంతవరకూ, రాబోయే కొన్ని నెలల కాలం కుటుంబాన్ని వదులుకొని డ్యూటీ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించి బాగా పనిచేసిన వారందరినీ కూడా అభినందించాలి. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ లో ఎవరైతే బాగా పని చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా తప్పకుండా ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేసారు. 

click me!