అందుకే కొడాలి నానిని హరికృష్ణ కొట్టి తరిమేశారు.. వంగలపూడి అనిత

Published : Oct 13, 2022, 04:16 PM ISTUpdated : Oct 13, 2022, 04:23 PM IST
అందుకే కొడాలి నానిని హరికృష్ణ కొట్టి తరిమేశారు.. వంగలపూడి అనిత

సారాంశం

 వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ మొదలు పెట్టినప్పుడు కొడాలి నాని బయటకు వస్తారని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ మొదలు పెట్టినప్పుడు కొడాలి నాని బయటకు వస్తారని విమర్శించారు. కొడాలి నాని ఎప్పుడైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. కొడాలి నాని ఏ రోజైనా బూతులే మాట్లాడతారని అన్నారు. 1999లో కొడాలి నానిని నందమూరి హరికృష్ణ బూతు ఏజెంట్‌గా పెట్టారని.. అయితే హరికృష్ణను ముంచేయడంతో ఆయన కొట్టి తరిమేశారని ఆరోపించారు. ఇది తాను అంటున్న మాట కాదని.. జనాల చెబుతున్నదేనని అన్నారు. 

‘‘ఆ తర్వాత కొడాలి నాని..  జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చేరాడు. అయితే అక్కడున్నవారితో వేధవ వేశాలు వేయడంతో తన పరువు పోతుందని ఎన్‌టీఆర్ కూడా నానిని దూరంగా పెట్టారు. ఇప్పుడు ఇసుక దందా, మైనింగ్ దందా, లిక్కర్ దందా చేస్తున్న కొడాలి నాని.. జగన్‌‌కు ఇచ్చే వాటాలు ఇవ్వకపోవడంతో  కేబినెట్ నుంచి తరిమేశారు. జగన్ దగ్గర మార్కులు పొందేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేసే సమయంలో బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు. ఇదంతా జనాల నుంచి వినిపిస్తున్న మాటే’’ అని వంగలపూడి అనిత అన్నారు. 

ఏ రోజైనా కొడాలి నాని నుంచి అవసరమైన పదాలు ఎప్పుడైనా వచ్చాయా అని ప్రశ్నించారు. కొడాలి నానికి తొలుత బీ ఫామ్ ఇచ్చిందేవరని ప్రశ్నించారు. చంద్రబాబుతో విబేధాలు వస్తే బయటకు వెళ్లిపోయి.. ఇలా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడమేమిటని ప్రశ్నించారు. కొడాలి నాని వాడే పదాలకు ఒక్క జగన్ మాత్రమే చప్పట్లు కొడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతి రైతుల యాత్ర విజయవంతంగా  పూర్తవుతుందని.. రాబోయే కాలంలో అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం