
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు నాగబాబు (nagababu) త్వరలో ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. జూన్ 1 నుంచి ఆక్ష్న పర్యటన ప్రారంభం కానుంది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లాలో, జూన్ 2న విజయనగరం జిల్లాలో, జూన్ 3న విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా నాగబాబు ఉత్తరాంధ్రకు చెందిన జనసేన ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలు, నియోజకవర్గ కమిటీ నేతలు, వివిధ విభాగాల కమిటీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యాచరణను జనసేన శ్రేణులకు నాగబాబు వివరించనున్నారు. అంతేకాకుండా, పార్టీ అభివృద్ధికి శ్రేణుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. తన పర్యటనలో భాగంగా, జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు నాగబాబు. ఆయన రాక నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సందడి మొదలైంది. నాగబాబు పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:‘ఆ వెధవను మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు’..సజ్జలకు నాగబాబు కౌంటర్..
ఇకపోతే.. Konaseema జిల్లా పేరు మార్పు వ్యవహారంతో andhra pradesh రాజకీయాలు వేడెక్కాయి. ఈ విధ్వంసం వెనుక టిడిపి, Janasena Party హస్తముందని వైఎస్ఆర్సీపి అంటుంటే.. కాదు, కాదు అధికార పార్టీనే అంటూప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మధ్యలో ‘అన్యం సాయి’ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అమలాపురంలో జరిగిన అల్లర్ల వెనుక ఈయన హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపికార్యకర్త అని కొన్ని ఫొటోలు వైరల్ అవుతుండగా.. వైఎస్ఆర్ సీపీ మాత్రం అతడు జనసేన పార్టీ కార్యకర్త అంటూ కొన్ని ఫోటోలను బయటపెట్టింది. వైఎస్ఆర్ సీపీ నేత Sajjala Ramakrishnareddy కూడా ఆరోపణలు చేశారు.
అన్యం సాయిపై సజ్జల చేసిన ఆరోపణలకు జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘మాతో ఫోటోలు తీయించుకున్న ఇలాంటి వెధవల్ని మీ వైసీపీ పార్టీలో చేర్చుకుని... ఇలాంటి విధ్వంసకరమైన పనులు చేస్తున్న మిమ్మల్ని, మీ పార్టీని ఏమనాలి సజ్జల? హలో మిస్టర్ సజ్జల.. మరి ఇటీవలే ఆ వెధవ మీతో దిగిన ఈ ఫోటోలకు మీరు ఏమని సమాధానం చెబుతారు. కొంచెం సంకుచిత ధోరణి విడనాడి విశాల దృక్పథంతో పని చేయండి. కులాల మధ్య చిచ్చులు పెట్టే నీచ రాజకీయాలు ఇకనైనా మానుకోండి. అమలాపురం ప్రజలందరికీ.. విన్నపం. మీరందరూ దయచేసి సంయమనం పాటించి ఇలాంటి వైసిపి కుట్రలకు మీరు బలి కావొద్దని నా విజ్ఞప్తి’.. అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.