విద్యుత్ చార్జీల పెంపుతోనే 2004లో టీడీపీ ఓటమి: వల్లభనేని వంశీ

By narsimha lodeFirst Published Sep 7, 2020, 4:26 PM IST
Highlights

 మూడు రోజుల క్రితం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న ఘర్షణ చాలా చిన్నదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. గతంలో తనతో పాటు టీడీపీలో తిరిగిన వారు ప్రస్తుతం వైసీపీకి మద్దతిస్తున్నారన్నారు. సమీప బంధువుల మధ్య చోటు చేసుకొన్న చిన్న ఘర్షణ రాజకీయ రంగు పులుముకొందన్నారు. 


గన్నవరం: మూడు రోజుల క్రితం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న ఘర్షణ చాలా చిన్నదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. గతంలో తనతో పాటు టీడీపీలో తిరిగిన వారు ప్రస్తుతం వైసీపీకి మద్దతిస్తున్నారన్నారు. సమీప బంధువుల మధ్య చోటు చేసుకొన్న చిన్న ఘర్షణ రాజకీయ రంగు పులుముకొందన్నారు. 

సోమవారం నాడు ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడారు.తమకు జగన్ మాత్రమే నాయకుడన్నారు. జగన్ నాయకత్వంలో పార్టీ నేతలంతా పనిచేస్తారని ఆయన చెప్పారు. గన్నవరంలో కూడ ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్పారు.గన్నవరంలో వైసీపీలో గ్రూప్ విబేధాలపై ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. 

వైఎస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్లే రైతులు బతికారని ఆయన చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగానే 2004లో టీడీపీ గెలవలేదని ఆయన గుర్తు చేశారు.
30 ఏళ్ల పాటు రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలను జగన్ అందిపుచ్చుకొన్నారని చెప్పారు.

ఉచిత విద్యుత్ కనెక్షన్ల మీటర్లకు పెట్టడం వల్ల రైతులపై భారం పడదని ఆయన అభిప్రాయపడ్డారు.హార్స్ పవర్ విద్యుత్ ను ఎన్టీఆర్ రూ. 50లకి ఇచ్చి రైతు కుటుంబాలు అభివృద్ధిలోకి రావడానికి కారణమైనట్టుగా ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే  అప్పుడు ప్రజలు మీకే మద్దతిస్తారన్నారు.హేతుబద్దమైన విమర్శలు చేయాలని వల్లభనేని వంశీ చంద్రబాబుకు సూచించారు.


 

click me!