టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్: ఆకస్మాత్తుగా కొడాలి, వల్లభనేని ప్రత్యక్షం

Published : Jun 09, 2022, 12:56 PM ISTUpdated : Jun 09, 2022, 01:16 PM IST
టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్: ఆకస్మాత్తుగా కొడాలి, వల్లభనేని ప్రత్యక్షం

సారాంశం

టెన్త్ విద్యార్ధులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ప్రత్యక్షమయ్యారు. దీంతో జూమ్ మీటింగ్ ను టీడీపీ నిలిపివేసింది. టీడీపీ నేతలకు జూమ్ మీటింగ్ లోనే కాదు నేరుగా సమాదానం చెబుతానని లోకేష్ చెప్పారు.


అమరావతి: Tenth విద్యార్ధులతో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లో మాజీ మంత్రి Kodali Nani, గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsiలు ప్రత్యక్షమయ్యారు. దీంతో జూమ్ మీటింగ్ కాల్ ను కట్ చేశారు టీడీపీ నేతలు. 


ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పడిపోయిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నాయి. ఈ విషయమై టెన్త్ క్లాస్ విద్యార్ధులతో నారా లోకేష్ ఇవాళ Zoom  APP  ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరశైలి విద్యార్ధులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయమై చెప్పారు.ఈ సమయంలోనే YCP కి చెందిన నేత Devender Reddy ఈ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షమయ్యారు.

 విద్యార్ధులతో రాజకీయం చేయడం సరైందా అని లోకేష్ ను ప్రశ్నించారు. జూమ్ ద్వారానే కాదు నేరుగానే మాట్లాడుతానని వైసీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు. అదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా జూమ్ మీటింగ్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లోకి ఈ ఇద్దరు రావడాన్ని గుర్తించిన టీడీపీ నేతలు జూమ్ మీటింగ్ ను  నిలిపివేశారు. విద్యార్ధులకు పంపిన జూమ్ మీటింగ్ లింక్ ద్వారా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ప్రత్యక్షమయ్యారని  టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు విచారణ చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఈ మీటింగ్ యాప్ లింక్ లు ఎవరిచ్చారనే విషయమై కూడా టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

కార్తీ కృష్ణ పేరుతో మాజీ మంత్రి కొండాలి నాని, నవ్య తోట పేరుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు జూమ్ కాన్ఫరెన్స్ లోకి  వచ్చారని టీడీపీ వర్గాలు గుర్తించాయి.  ఏపీలో టెన్త్ క్లాస్ లో తక్కువ మంది విద్యార్ధులు పాస్ కావడంపై విద్యార్ధుల్లో మనోధైర్యం కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్న తరుణంలో  వైసీపీ నేతలు తమ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని టీడీపీ  ఆరోపిస్తుంది.

తాను అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పలేదని వైసీపీ నేత దేవేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విద్యార్ధులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై తాను లోకేష్ తో మాట్లాడానన్నారు. అయితే రెండు నిమిషాల్లోనే తనను మ్యూట్ చేశారన్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నానిలు జూమ్ కాల్ లో కన్పించగానే కాల్ ను కట్ చేశారని దేవేందర్ రెడ్డి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

also read:ఫెయిలైన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలి.. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి: పవన్ కల్యాణ్

టెన్త్ క్లాస్ లో 6 లక్షలకు పైగా విద్యార్ధులు పరీక్షలు రాస్తే కేవలం నాలుగు లక్షలకు  పైగా విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఉత్తీర్ణత దారుణంగా పడిపోయిందని విపక్షాలు చెబుతున్నాయి. విద్యార్ధులకు 10 మార్కలు కలిపి ఫెయిలైన విద్యార్ధులను పాస్ చేయించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!