నిడదవోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 12, 2024, 09:52 PM IST
నిడదవోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార వైసిపి ఒక్కటి ఓవైపు... ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి మరోవైపు నిలిచాయి. సరిగ్గా 2014 అసెంబ్లీ ఎన్నికల పరిస్థితే 2024 లో చోటుచేసుకుంది. మరి ఎలక్షన్ రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి.   

నిడదవోలు రాజకీయాలు : 

అసెంబ్లీ ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్ని సందిగ్దత నిడదవోలు సీటుపై క్లారిటీ ఇచ్చింది. ఇరుపార్టీల ఒప్పందం తర్వాత రాజమండ్రి రూరల్ సీటు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి... నిడదవోలు టికెట్ కందుల దుర్గేష్ కు దక్కింది.  

ఇక నిడదవోలు టికెట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తీవ్ర అసహానానికి గురయ్యారు. నిడదవోలు నుండి పోటీకి సిద్దమవుతున్న వేళ సడన్ గా జనసేన ప్రకటన రావడంతో శేషారావు ఖంగుతిన్నారు. వెంటనే తన అనుచరులు, స్థానిక టిడిపి నేతలతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 

నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. ఉండ్రాజవరం 
2.  నిడదవోలు 
3. పెరవలి
 
నిడదవోలు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  2,03,240

పురుషులు -  1,00,095
మహిళలు ‌-   1,03,138

నిడదవోలు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

నిడదవోలు నుండి మళ్ళీ జి. శ్రీనివాస్ నాయుడు పోటీ చేయనున్నారు. ఆయననే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు అభ్యర్థిగా వైసిపి అదిష్టానం ఎంపికచేసింది.  

టిడిపి‌-జనసేన-బిజెపి కూటమి అభ్యర్థి :

పొత్తులో భాగంగా నిడదవోలు సీటును జనసేనకు కేటాయించింది టిడిపి. దీంతో జనసేన కందుల దుర్గేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. 


నిడదవోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

నిడదవోలు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,66,403 (82 శాతం)

వైసిపి - జి. శ్రీనివాస్ నాయుడు - 81,001 (48 శాతం) ‌ - 21,688 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

టిడిపి - బూరుగుపల్లి శేషారావు - 59,313 (35 శాతం) - ఓటమి 

 
నిడదవోలు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1, 63,398 (85 శాతం)

టిడిపి  - బూరుగుపల్లి శేషారావు- 81,591 (49 శాతం) - 6,359 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - ఎస్ రాజీవ్ కృష్ణ  - 75,232 (46 శాతం) - ఓటమి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!