చాతుర్మాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Oct 10, 2018, 10:06 PM IST
Highlights

జనసేన అధినేత సినీహీరో పవన్ కళ్యాణ్ దేవీశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చాతుర్మాస దీక్ష చేపట్టారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పట్టిసీమలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. 

పోలవరం: జనసేన అధినేత సినీహీరో పవన్ కళ్యాణ్ దేవీశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చాతుర్మాస దీక్ష చేపట్టారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పట్టిసీమలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు పవన్ కళ్యాణ్  కు మేళ తాళాల నడుమ స్వాగతం పలికారు. 

ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరేశ్వరస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. 

దసరా శరన్నవరాత్రల్లో మెుదటి రోజు కావడంతో పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేపట్టారు. తొమ్మిది రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. తొమ్మిది రోజులపాటు కేవలం పాలు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకిస్తారు. ప్రతీ ఏడాది తొమ్మిది రోజులపాటు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయడం ఆనవాయితీ. 

click me!