రెండిళ్లు ఉన్న మిమ్మల్ని హైదరాబాద్ నుంచి కేసీఆర్ గెంటేస్తే కోపమెుస్తే... మరి వాళ్లకి:పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Oct 10, 2018, 9:57 PM IST
Highlights

పోలవరం నిర్వాసితుల కోసం జనసేన పార్టీ బలమైన విధానంతో కూడిన పోరాట కమిటీని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం పోలవరం, పట్టిసీమ, డంపింగ్ యార్డు నిర్వాసితులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారి కష్టాలు చూసి చలించిపోయారు. మీ కష్టాలు చూసి బాదేస్తున్నా చేతిలో అధికారం లేదు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పవన్ తెలిపారు. 

పోలవరం: పోలవరం నిర్వాసితుల కోసం జనసేన పార్టీ బలమైన విధానంతో కూడిన పోరాట కమిటీని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం పోలవరం, పట్టిసీమ, డంపింగ్ యార్డు నిర్వాసితులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారి కష్టాలు చూసి చలించిపోయారు. మీ కష్టాలు చూసి బాదేస్తున్నా చేతిలో అధికారం లేదు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పవన్ తెలిపారు. 

పోలవరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పవన్ హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఎలాంటి పోరాటానికైనా జనసేన అండగా ఉంటుందని తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. 

మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని. 15 ఎకరాల భూమి ఉన్న రైతును రెండెకరాల ఆసామీ చేశారంటూ మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టు కోసం త్యాగాలు చెయ్యమన్నారు త్యాగాలు చేసిన వారికోసం ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. దొడ్డిదారిన మీ కొడుక్కి ఎమ్మెల్సీ పదవి తప్ప అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబుకు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. విజయవాడలో ఒక ఇల్లు ఉంది. రెండు ఇళ్లు ఉన్న చంద్రబాబును కేసీఆర్ హైదరాబాద్ నుంచి గెంటేస్తే కోపం వచ్చిందని అలా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులన రాత్రికి రాత్రే గెంటేస్తే వారికి ఎంత కోపం రావాలని నిలదీశారు. 

రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించి 85 కిలోమీటర్ల దూరం గెంటేస్తే వాళ్లు ఎలా బతకాలని ప్రశ్నించారు. కనీసం అక్కడ మౌళిక వసతులు కూడా లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలవరాన్ని అడ్డుకుంటున్నారని విమర్శిస్తారని ఆరోపించారు. తాము ప్రాజెక్టులు అడ్డుకోవడం లేదని....బాధితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 

అయిన వారి కోసం జీవోలు విడుదల చేసేస్తారు కానీ పోలవరం నిర్వాసితుల తరలింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. లేని వాహనాళ్లు చూపించి కోట్లు తినేశారన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి చూస్తే కోపం వస్తుందని కానీ ఆ స్థాయి దాటిపోయిందన్నారు. బలంగా ఆలోచించి వాళ్లకి న్యాయం జరిగేలా మేనిఫెస్టోలో పెడతానని హామీ ఇచ్చారు. 

click me!