తిరుపతి : వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం ఎగబడ్డ భక్తులు, తోపులాట.. టీటీడీపై విమర్శలు

By Siva KodatiFirst Published Dec 31, 2022, 8:55 PM IST
Highlights

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తుల మధ్య తోపులాట జరిగింది.

తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తుల మధ్య తోపులాట జరిగింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనం టోకెన్ల కోసం వేచివున్న భక్తులను క్యూలైన్‌లోకి అధికారులు వదిలారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. 

కాగా.. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎంతోమంది అనుకుంటారు. ఆ రోజు తమ పలుకుబడిని ఉపయోగించి దర్శనానికి పోటెత్తుతారు. అయితే విమర్శల నేపథ్యంలో టీటీడీ ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లను డిసెంబర్ 24న ఆన్‌లైన్‌లో వుంచగా.. కేవలం 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టీటీడీ తెలిపింది. టికెట్ల కొనుగోలు చేసేందుకు ఒకేసారి 2 లక్షల 50 వేల మంది వెబ్‌సైట్‌ని సందర్శించారని.. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని టీటీడీ వెల్లడించింది. 

ALso REad: తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనానికి హై డిమాండ్... 44 నిమిషాల్లో 2.20 లక్షల టికెట్లు ఖాళీ

జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి...శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను వుంచింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశం నిమిత్తం 20 వేలు, సర్వదర్శనం కోసం రోజుకు 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవాణి టికెట్లు పొందిన వారికి మహా లఘు దర్శనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అలాగే డిసెంబర్ 29 వ తేదీ నుంచి జనవరి 3 వరకు గదుల రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 
 

click me!