కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఇంత ఆస్తి ఉందా...?

By Galam Venkata Rao  |  First Published Jun 10, 2024, 1:57 AM IST

కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వెరీ రిచ్. ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా...? దేశంలో మరే ఇతర ఎంపీకి అంత పెద్దమొత్తంలో ఆస్తులు లేవట....


తాజా లోక్ సభ ఎన్నికల బరిలో దిగి.. గుంటూరు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆదివారం ప్రధాని మోదీ కేబినెట్లో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రివర్గం పదవినీ దక్కించుకున్నారు. వృత్తిపరంగా వైద్యుడు, వ్యాపారవేత్త అయిన చంద్రశేఖర్ ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 

ఆస్తులే కాదు, ఆయనపై కేసు ఓ కేసు కూడా ఉంది. 

Latest Videos

గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫిడివిట్ లో తెలిపిన వివరాలు..

విద్యార్హతలు : M.D, M.B.B.S

భార్య : శ్రీరత్న కోనేరు

మొత్తం ఆస్తి : రూ.5,785 కోట్లు 

చరాస్తి విలువ : రూ.5,598.65 కోట్లు

స్థిరస్తి విలువ : రూ186.63 కోట్లు

కేసులు : 1

అప్పులు : రూ.1,038 కోట్లు

చేతిలో ఉన్న డబ్బు : రూ.2,06,400

బంగారం : 181 గ్రాములు, భార్యకు 2,567.135 గ్రాములు బంగారం

భారత దేశంలోనే ఒక ఎంపీ అభ్యర్థిగా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖరేనని అప్పట్లో వార్తల్లోకి కూడా ఎక్కారు.

పెమ్మసాని చంద్రశేఖర్ నేపథ్యం...

గుంటూరు జిల్లా 

గుంటూరు జిల్లా బుర్రిపాలేనికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ 1999లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తరువాత అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియాలో 2005లో పీజీ పూర్తిచేశారు. ఆయన భార్య వైద్యురాలే. అమెరికాలో ఇద్దరూ వ్యాపారాలు కూడా నిర్వహించారు. ‘యు వరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన ఆదాయ వనరు. ఈ సంస్థ ద్వారా మెడికల్, నర్సింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, లీగల్, ఫార్మసీ తదితర రంగాలలో పరీక్షలకు ఆన్‌లైన్‌లో మెటీరియల్ విక్రయిస్తుంటారు. ఇవే కాకుండా అమెరికాలో 101 లిస్టెడ్ కంపెనీలలో పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులకు సుమారు రూ.2,415 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.

రెండో ధనిక ఎంపీ ఆయనే...

పెమ్మసాని చంద్రశేఖర్ తర్వాత భారీగా ఆస్తులు కలిగిన వ్యక్తి తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రూ.4,568 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి మనవడు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు కేవీ రంగారెడ్డి పేరు పెట్టారు. 

click me!