ఏపీ, తెలంగాణ నుంచి ఎవరూ ఢిల్లీ రావట్లేదు.. పైరవీలు లేవు, ఇదీ మోడీ అంటే: విజయవాడలో కిషన్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 19, 2021, 2:21 PM IST
Highlights

మోడీ నాయకత్వంలో గడిచిన ఏడేళ్లలో రూపాయి కూడా అవినీతి లేని పరిపాలన అందించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలో జన ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత .. ఇల్లు కేటాయింపులో ఆలస్యంలో జరగడంతో తాను కొంతకాలం ఢిల్లీ ఏపీ భవన్‌లోనే వున్నానని తెలిపారు. 

విజయవాడ తనకు కొత్త కాదన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. గురువారం నగరంలో ఆయన జన ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. గతంలో తాను కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశానని ఆయన గుర్తుచేశారు. జిన్నా తెచ్చిన ఆర్టికల్ 370ని బీజేపీ  రద్దు చేసిందని  కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ నాయకత్వంలో గడిచిన ఏడేళ్లలో రూపాయి కూడా అవినీతి లేని పరిపాలన అందించామన్నారు.

కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత .. ఇల్లు కేటాయింపులో ఆలస్యంలో జరగడంతో తాను కొంతకాలం ఢిల్లీ ఏపీ భవన్‌లోనే వున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వుండగా ఏపీ భవన్ కళకళలాడేదని .. ఆంధ్రా, తెలంగాణల నుంచి పెద్ద ఎత్తున పైరవీ కారులు వచ్చే వారని స్వయంగా క్యాంటీన్ ఓనర్ తనతో చెప్పారని ఆయన వెల్లడించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి పైరవికారులు లేకుండా పోయారని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో అనేక కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు. 
 

click me!