పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిస్తాం: ఇందుకూరుపేటలో కేంద్ర మంత్రి షెకావత్

Published : Mar 04, 2022, 11:40 AM ISTUpdated : Mar 04, 2022, 02:04 PM IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిస్తాం: ఇందుకూరుపేటలో కేంద్ర మంత్రి షెకావత్

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కాలనీని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్, ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు పరిశీలించారు.

ఇందుకూరుపేట:Polavaram ప్రాజెక్టుకు అవసరమైన నిధులను తమ ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని Devipatnam  మండలం ఇందుకూరుపేట-1 పోలవరం పునరావాసం కాలనీని ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌లు శుక్రవారం నాడు పరిశీలించారు.నిర్వాసితులతో కేంద్ర మంత్రి షెకావత్, ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఏనుగులగెడం, మంటూరు, ఆగ్రహారం గ్రామాల ప్రజల కోసం Indukuripet-1 పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి Gajendra Shekhawat చెప్పారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన సీఎం YS Jagan నుకేంద్ర మంత్రి అభినందించారు.

నిర్వాసితుల సమస్యలపై తాను సీఎం జగన్ తో చర్చించామన్నారు. పునరావాస కాలనీలో నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని ఆయన కోరారు. మరో వైపు నిర్వాసితులకు జీవనోపాధిని కల్పించాలని కూడా కోరుతున్నామన్నారు.  ఈ  ప్రాజెక్టు నిర్మాణం పూర్తైన తర్వాత తాను మరోసారి  ఇక్కడికి వస్తానని కేంద్ర మంత్రి షెకావత్   తెలిపారు.

Polavaram project నిర్మాణ పనులు మరింత వేగంగా చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.  ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస పనులపై కూడా అధికారులు శ్రధ్ద చూపాలని సీఎం కోరారు.పోలవరం ప్రాజెక్టు Andhra Pradesh రాష్ట్రానికి ఒక జీవనాడి అని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని సీఎం జగన్ తెలిపారు.

2006లో YSR పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సమయంలో లక్షన్నర రూపాయాలకే తమ భూములను ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో భూములు ఇచ్చిన వారికి  ప్రస్తుతం మరో నాలుగు లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్  విషయమై కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించినట్టుగా జగన్ వివరించారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా కార్యాచరణను రూపొందించనున్నట్టుగా సీఎం తెలిపారు.

 పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. 

 టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు ఈ విషయాన్ని తెలిపారు. పోలవరం పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని వెల్లడించారు. 

2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యం జరిగిందన్నారు.. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి  వివరించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తైనట్టుగా మంత్రి తెలిపారు.  అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని మంత్రి వివరించారు. 

పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమే. అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్‌సీసీ నివేదిక ఇచ్చిందన్నారు.  దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని అని మంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే