స్టీల్ ప్లాంట్ రగడ: ప్రైవేటీకరణ వల్ల అన్ని లాభాలే.. జయదేవ్‌కు అనురాగ్ ఠాకూర్ లేఖ

By Siva KodatiFirst Published Mar 30, 2021, 5:13 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గతంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గల్లా జయదేవ్ రాసిన లేఖకు సమాధానమిస్తూ లేఖ రాశారు ఠాకూర్. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గతంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గల్లా జయదేవ్ రాసిన లేఖకు సమాధానమిస్తూ లేఖ రాశారు ఠాకూర్.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు సంస్థలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయించిందని ఠాకూర్ లేఖలో పేర్కొన్నారు.

అందులో పనిచేసే ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలకు న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్. 

మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణపై నీతి అయోగ్ స్పీడ్ పెంచింది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ఆస్తుల ద్వారా నగదు సేకరణపై రాష్ట్రాలకు సూచనలు చేయనుంది.

నేషనల్ మానటైజేషన్ పైప్ లైన్- ఎన్ఎంపీ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని సూచించింది. అలాగే పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో కీలకంగా మారాయి  నీతి ఆయోగ్ సూచనలు. జాతీయ ఆస్తుల నుంచి నిధుల సమీకరణ చేసే క్రమంలో ప్రైవేటీకరణ, విలీనం, మూసివేత వంటి అంశాలు ఉంటాయని నీతి ఆయోగ్ క్లారిటీ ఇచ్చింది. 
 

click me!