పోలవరం ముంపు: ఈ నెల 29న నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ మీటింగ్

By narsimha lodeFirst Published Sep 21, 2022, 2:34 PM IST
Highlights

ఈ నెల 29న పోలవరం ముంపు సమస్యపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. 

అమరావతి:ఈ నెల 29వ తేదీన పోలవరంపై సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ. పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం ముంపు సమస్యపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.పోలవరం ముంపు సమస్య విసయమై సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ.

ఈ ఏడాది సెప్టెంబర్ 14న ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణీత సమయం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం సరైంది కాదని ఒడిశా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ సమావేశాన్ని ఆ రోజు వాయిదా వేశారు.ఈ నెల 29వ తేదీన ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపుపై మూడు రాష్ట్రాలు  సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తిమంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. 

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి భారీగా వరద వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగానే తాము తీవ్రంగా ఇబ్బందులు పడినట్టుగా తెలంగాణకు చెందిన మంత్రులు విమర్శలు చేసిన విసయం తెలిసిందే. 1986 తర్వాత గత జూలై మాసంలోనే గోదావరి సుమారు 24.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. భద్రాలచం వద్ద గోదావరి నది 71 అడుగులకు పైగా ఎత్తులో ప్రవహించింది. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

also read:పోలవరంపై తెలంగాణ అనుమానాలు నివృత్తి చేస్తాం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

ఈ విషయమై ఏపీ మంత్రులు కూడా స్పందించారు. తెలంగాణ అనుమానాలను నివృత్తి చేస్తామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. 1986లో గోదావరికి సుమారు 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి.  ఈ పరిస్థితులను  దృష్టిలో ఉంచుకొని న్యాయం చేుయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ, పోలవరం అథారిటీకి లేఖలు రాసింది.  పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల అనుమానాలను తాము నివృత్తి చేస్తామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు గతంలోనే ప్రకటించారు. అన్నీ అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి రాంబాబు వివరించారు.
 

click me!