ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 వెండి నాణెం త్వరలోనే విడుదల కానుంది. ఈ నాణెం నమూనాను మింట్ అధికారులు దగ్గుబాటి పురంధేశ్వరికి చూపారు.
అమరావతి:టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు బొమ్మతో రూ. 100 నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వంద రూపాయాల నాణెం పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు. ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపించారు. ఈ నాణెంపై సలహలు, సూచనలు కోరారు.
2022 మే 28వ తేదీ నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ చిత్రంతో కూడా నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే.