పింగళి వెంకయ్యకు భారత రత్నపై కేంద్రం నిర్ణయం: కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Jul 31, 2022, 5:12 PM IST
Highlights

జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్యకు  భారత రత్న ఇచ్చే విషయమై కేంద్రం నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నెలలో ఒక్క రోజూ కూడా సచివాలయానికి రాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

విజయవాడ: జాతీయ జెండా రూపకర్తర పింగళి వెంకయ్యకు భారత రత్న విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి kishan Reddy చెప్పారు. 

ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ జెండా రూపకర్త Pingali Venkayya కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్  ఉందన్నారు.ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు..ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన కేంద్రానికి వచ్చిన విషయం తనకు తెలియదన్నారు.  వెంకయ్యకు భారత రత్న విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందన్నారు 
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి సందర్భంగా ఆగష్టు 2న  ఢిల్లీలో కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఆగష్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని మంత్రి కోరారు. 

Telamgana CM  కేసీఆర్ నెలలో ఒక్క రోజూ కూడా సచివాలయానికి రాడని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి చెప్పారు. KCR  20 రోజులు ఫామ్ హౌస్ లో ఉంటే 10 రోజులు ఇంట్లో ఉంటారన్నారు. సచివాలయానికి ఎప్పుడూ రారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ప్రధాని Narendra Modi  ఒక్య సెలవు కూడా తీసుకోలేదన్నారు. తాము కూడా సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీకి వెళ్లి  ఇవాళే Hyderabad కు చేరుకొన్నారు. ఐదు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారని కేంద్ర మత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఢిల్లీలో సీఎం కేసీఆర్ ను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రెండు రోజుల క్రితం కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నేతలను కలవాలని కేసీఆర్ భావించారు. కానీ, అఖిలేష్ యాదవ్ మినహా ఇతర నేతలు ఎవరూ కూడా కేసీఆర్ తో భేటీ కాలేదు. 

తెలంగాణ రాష్ట్రంలో వరదలు, వర్షాలపై కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఇస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే కేంద్ర మంత్రులను ఎవరినీ కూడ కలవకుండానే కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంపై విపక్షాలు విమర్శలు చేశారు.
 

click me!