ప్రజా ప్రతినిధులకూ వేధింపులు .. లోన్ యాప్‌లపై జగన్‌తో మాట్లాడతా : ఏపీ హోంమంత్రి తానేటి వనిత

Siva Kodati |  
Published : Jul 31, 2022, 04:37 PM IST
ప్రజా ప్రతినిధులకూ వేధింపులు .. లోన్ యాప్‌లపై జగన్‌తో మాట్లాడతా : ఏపీ హోంమంత్రి తానేటి వనిత

సారాంశం

లోన్ యాప్ వ్యవహారంపై సీఎం జగన్‌తో మాట్లాడతానన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తానేటి వనిత వెల్లడించారు. లోన్‌ల పేరుతో ప్రజా ప్రతినిధులను సైతం వేధిస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు.   

తెలియక కొందరు లోన్ యాప్‌కు (loan app) ఆకర్షితులవుతున్నారని అన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత (taneti vanitha). లోన్ యాప్ ఏజెంట్లు బాధితుల మొబైల్ డేటాను తీసుకుని వేధించడం నేరం అన్నారు. లోన్ యాప్ వేధింపుల వ్యవహారాన్ని సీఎం జగన్ (ys jagan) దృష్టికి తీసుకెళ్తామని హోంమంత్రి చెప్పారు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తానేటి వనిత వెల్లడించారు. లోన్‌ల పేరుతో ప్రజా ప్రతినిధులను సైతం వేధిస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. దీనిపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (ap dgp rajendranath reddy) మాట్లాడుతూ.. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్‌ను కొన్ని సంస్థల నుంచి సేకరిస్తున్నారని అన్నారు. కొన్ని ఫోన్ కాల్స్ అజ్ఞాతం నుంచి వస్తున్నాయని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్ నిర్వాహకులపై నిఘా పెట్టామని ఆయన చెప్పారు. 

Also REad:బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. బాబు, పవన్ ఆటలు సాగవు : ప్లీనరీలో అనిల్ కుమార్ యాదవ్

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy) , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లకు (anil kumar yadav) లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసిన ఓ ఏజెంట్.. మీరు తీసుకున్న 8 లక్షల రూపాయల అప్పును తీర్చాలంటూ అడిగాడు. నేనే అప్పు తీసుకోలేదని అనిల్ కుమార్ చెప్పగా.. మీ బావమరిది అశోక్ కుమార్ మీ నెంబర్ ఇచ్చారని, అప్పు డబ్బులు వాడుకున్నందుకు బాకీ కూడా తీర్చాలని ఏజెంట్ అన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్ కుమార్ యాదవ్.. ఇంకోసారి డబ్బులు తీసుకున్నాను అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఎవడో నెంబర్ ఇస్తే నేను డబ్బులు తీసుకున్నానని అంటావా అంటు ఫైర్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం