పోలవరంపై ఏపీ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్: రూ. 2,234 కోట్లు చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Nov 2, 2020, 7:47 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు బకాయిలపై ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలకు కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు బకాయిలపై ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలకు కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది.

ఎలాంటి షరతులు లేకుండా బకాయిలు విడుదల చేయడానికి కేంద్ర ఆర్ధిక శాఖ  సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర  ఆర్ధిక శాఖ కేంద్ర జల్ శక్తి శాఖకు మెమోను పంపింది.

ప్రాజెక్టుకు అవసరమైన రూ. 2,234.288 కోట్లు చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది.వీలైనంత త్వరగా ప్రక్రియను పీపీఏను పూర్తి చేయాలంటూ జల్ శక్తి శాఖకు మెమో జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.

also read:పోలవరం రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనాలు ఆమోదించాలి: పీపీఏ సమావేశంలో ఏపీ డిమాండ్


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులను విడుదల చేయాలని కోరుతూ ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశాడు.ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసానికి సంబంధించి నిధులను కూడ ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరాడు.2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని కూడ జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు.ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆలస్యమయ్యేకొద్దీ వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు.

click me!