
అమరావతి:పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన అంచనాలను ఆమోదించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)సమావేశంలో ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ రాష్ట్ర ప్రతిపాదనపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూలంగా స్పందించింది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సోమవారం నాడు హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో ఏపీ తరపున నీటి పారుదల శాఖాధికారులు పాల్గొని తమ డిమాండ్లను విన్పించారు.
పోలవరం ముంపు ముగిసిన అధ్యాయమని ఏపీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చెప్పారు. ముంపు సమస్యపై ఇప్పట్లో చర్చ ఉండదన్నారు. ప్రాజెక్టులో నీరు నిల్వ చేసినప్పుడు సమస్యలొస్తే పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై అథారిటీ మీడియాకు సమాచారం ఇవ్వనుందని ఏపీ నీటిపారుదల శాఖాధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు.