
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చొరవతో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు భరోసా దక్కింది. బహ్రెయిన్ ఓ ప్రైవేట్ సంస్థ తమ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఇలా విదేశాల్లో ఇబ్బందిపడుతున్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు కూడా వున్నారు. దీంతో వారిని ఆదుకోవాలంటూ కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్ కు ఇటీవలే సీఎం లేఖ రాశారు. దీంతో వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సమాచారం ఇవ్వగా సమస్య పరిష్కారమయ్యింది.
తమ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న బహ్రెయిన్ లోని ఎన్‌హెచ్‌ఎస్ సంస్థతో భారత రాజభార కార్యాలయ అధికారులు మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో సిబ్బంది తిరిగి విధుల్లోకి తీసుకోడానికి ఆ సంస్థ అంగీకరించినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు.
read more కారణమిదీ:కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ
బహ్రెయిన్ లోని ఓ పెట్రోలియం కంపెనీకి ఎన్‌హెచ్‌ఎస్ అనే సంస్థ సబ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. అయితే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లిన శ్రీకాకుళం వాసులు చాలామంది ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సరైన మౌలిక వసతులు కల్పించకుండా ఈ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం జగన్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి దృష్టికి ఓ లేఖ ద్వారా తీసుకెళ్లారు. దీంతో ఎన్‌హెచ్‌ఎస్ సంస్థలో పనిచేస్తున్న తెలుగువారికే కాదు బారతీయులు, నేపాలీల సమస్య పరిష్కారమయ్యింది.