దారుణం : భార్య మీద అనుమానం.. కొడవలితో కాలు, చేయి నరికేసిన భర్త... !

Published : Sep 16, 2021, 09:01 AM IST
దారుణం : భార్య మీద అనుమానం.. కొడవలితో కాలు, చేయి నరికేసిన భర్త... !

సారాంశం

ఇటీవల భార్య మీద అనుమానంతో భర్త నిత్యం వేధించేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం దంపతులిద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో నాగనాయక్ భార్య మీద కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కాలు, చేయి మీద కొడవలితో కొట్టడంతో... ఆ దెబ్బకు కాలు, చేయి తెగిపడ్డాయి. 

కడప : కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త అనుమానంతో కట్టుకున్న భార్య కాలు, చేయిని కొడవలితో నరికేసిన ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో చోటు చేసుకుంది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్తావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ (45)కు పాతికేళ్ల క్రితం వివాహమయ్యింది. కొన్నాళ్లపాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగిందని బంధువులు తెలిపారు. 

ఇటీవల భార్య మీద అనుమానంతో భర్త నిత్యం వేధించేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం దంపతులిద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో నాగనాయక్ భార్య మీద కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కాలు, చేయి మీద కొడవలితో కొట్టడంతో... ఆ దెబ్బకు కాలు, చేయి తెగిపడ్డాయి. 

ఇది గుర్తించిన బంధువులు బాధితురాలిని వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన భర్త పరారీలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert