వివేకా హత్య కేసు : ‘తొలి గొడ్డలి వేటు ఉమాశంకర్ రెడ్డిదే’.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు...

Published : Mar 24, 2022, 08:34 AM IST
వివేకా హత్య కేసు : ‘తొలి గొడ్డలి వేటు ఉమాశంకర్ రెడ్డిదే’.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు...

సారాంశం

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డే మొదటగా వివేకా మీద గొడ్డలివేటు వేశాడని సీబీఐ కడప కోర్టులో వాదనలు వినిపించింది. దీంతో కోర్టు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. 

కడప : మాజీమంత్రి Vivekananda Reddy murder caseలో కీలక నిందితుడిగా ఉన్న Umashankar Reddyకి  bail ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని Kadapa Courtలో సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను హత్య చేయడానికి నలుగురు సహా నిందితులతో కలిసి కుట్రపన్నారని, ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని CBI అభిప్రాయపడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని, స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో ఉమా శంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని వాదించింది. వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమా శంకర్ రెడ్డినే అని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది.

సిబిఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. హత్య కేసులో మూడవ నిందితుడిగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ జరిగింది. వాచ్ మెన్  రంగన్న, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వివేకాను హత్య చేసిన నలుగురిలో ఉమా శంకర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను ఆయన ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలు కలిసి హత్య చేశారని, ఆ సమయంలో తిడుతూ గొడ్డలితో ఆయన తలపై తొలి వేటు వేసింది ఉమా శంకర్ రెడ్డినే అని సిబిఐ దర్యాప్తులో తేలినట్లు కోర్టుకు నివేదించింది.  

అంతేకాదు, వివేకాను స్నానాల గదిలో పడేసిన తర్వాత మరో ఐదారు సార్లు తలపైన గొడ్డలితో ఉమా శంకర్ రెడ్డే నరికాడని వివరించింది.  హత్య జరిగిన రోజున వేకువ జామున మూడు గంటల 15 నిమిషాలకు పారిపోతున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది. కేసు విచారణలో భాగంగా ఉమా శంకర్ రెడ్డి ద్విచక్రవాహనాన్ని, ఇంట్లోని రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో బెయిల్ ఇస్తే హత్యకు ఉపయోగించిన ఆయుధాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని వాదించింది. 

అయిదవ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని..  అందులో భాగంగానే గంగాధర్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, సిఐ శంకరయ్య మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన తర్వాత మాట మార్చారని పేర్కొంది. సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తోందని.. బెయిల్ ఇవ్వడం ద్వారా ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పునరుద్ఘాటించింది. అసలైన కుట్రదారులను తెలుసుకునేందుకు ఉమా శంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయించడానికి పులివెందుల కోర్టులో పిటిషన్ వేస్తే,  అతను నిరాకరించారని సిబిఐ గుర్తు చేసింది.  

ఇప్పటికే కడప కోర్టులో రెండు సార్లు. హైకోర్టులో ఓసారి బెయిల్ పిటిషన్ వేస్తే న్యాయస్థానాలు కొట్టేసిన విషయాన్ని సి.బి.ఐ తన కౌంటర్ పిటిషన్ లో ఉటంకించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇదే కేసులో దస్తగిరి, రంగన్న భద్రతపై సీబీఐ వేసిన పిటిషన్ పై విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం