ఇద్దరం కలిసే లిక్కర్ షాప్‌కి వెళ్దాం.. తేలిపోతుంది కదా : సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

Siva Kodati |  
Published : Mar 23, 2022, 06:43 PM ISTUpdated : Mar 23, 2022, 06:44 PM IST
ఇద్దరం కలిసే లిక్కర్ షాప్‌కి వెళ్దాం.. తేలిపోతుంది కదా : సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

సారాంశం

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సారా మరణాలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ఇద్దరం కలిసి లిక్కర్ షాపు వద్దకు వెళ్లి నిజానిజాలు వెలికి తీద్దామన్నారు. 

పెగాసస్ (pegasus) వ్యవహారంపై హౌస్ కమిటీ వేశారని.. సారా మరణాలు, నాటు సారాపైనా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh) . లేని పక్షంలో సీబీసీఐడీ అయినా పర్లేదన్నారు. అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను ఉంగుటూరు పీఎస్ వద్ద పరామర్శించిన నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. బాబాయ్ హత్యపైనా సీబీఐకి జగన్ లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. నాటు సారా, కల్తీ లిక్కర్, జే బ్రాండ్‌పై ప్రజా ఉద్యమం చేస్తామని లోకేశ్ చెప్పారు. 

సభలో ప్రకటనలు ఇచ్చి పారిపోవడం కాదంటూ సీఎం జగన్‌కు ఆయన చురకలు అంటించారు. దమ్ము ధైర్యం వుంటే ప్రభుత్వం తమతో చర్చించాలని లోకేశ్ సవాల్ విసిరారు. కలిసే లిక్కర్ షాపు వద్దకు వెళ్లి వాస్తవాలు వెలికి తీద్దామంటూ ఆయన కోరారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారని లోకేశ్ ప్రశ్నించారు. ఏడు రోజులుగా కౌన్సిల్‌లో చర్చ కోరుతున్నామన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధం పెడితే ఈ గొడవలు వుండవు కదా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పారంటూ సెటైర్లు వేశారు. 

కాగా.. Vijayawadaలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బుధవారం నాడు టీడీపీ ప్రయత్నించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డి గూడెంలో మరణాలపై TDP ఇవాళ  Excise కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది.  దీంతో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్  చేశారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Atchannaidu సహా పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నాడు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వరకు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు. అయితే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనికి టీడీపీ నేతలను అనుమతించలేదు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. శాంతియుతంగా నిరసనకు పూనుకున్న తమను అరెస్ట్ చేయడం సరైంది కాదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్‌ఈబీ అధికారులే జంగారెడ్డిగూడెంలో పలు కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.జంగారెడ్డిగూడెం మరణాలపై  ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని  టీడీపీ మండిపడుతుంది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అంతకుముందు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చిడతలు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యులు  చిడతలు వాయించిన అంశాన్ని ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లనున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన అంశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును స్పీకర్ తప్పు బట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం