Udayagiri assembly elections result 2024 : ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

Published : Jun 04, 2024, 09:27 AM IST
Udayagiri assembly elections result 2024 : ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

సారాంశం

Udayagiri assembly elections result 2024 live : ఇటీవల ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న నియోజకవర్గం ఉదయగిరి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడని అతడిని వైసిపి నుండి తొలగించారు. ఇప్పుడు ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డినే ఉదయగిరి బరిలో దింపింది వైసిపి. ఇలా ఉదయగిరి రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుండటంతో ఎలక్షన్ రిజల్ట్ పై ఉత్కంఠ నెలకొంది. 

Udayagiri assembly elections result 2024 live :  ఉదయగిరి రాజకీయాలు :

కేంద్ర మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. ఇలాంటి సమయంలో ఉదయగిరిలో వెంకయ్యనాయడు బిజెపి తరపున పోటీచేసి గెలిచారు. ఇలా ఉదయగిరి నుండి ప్రారంభమైన వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ఉపరాష్ట్రపతివరకు సాగింది. 

ఇక మేకపాటి కుటుంబం కూడా ఉదయగిరి రాజకీయాలను శాసించింది. 1983లో వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయినా 1985లో మళ్లీ పోటీచేసి విజయం సాధించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ తర్వాత  ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2004, 2009, 2012(ఉప ఎన్నికలు) అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014 లో టిడిపి చేతిలో ఓడిన ఆయన మళ్ళీ 2019లో వైసిపి తరపున పోటీచేసి గెలిచారు. 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్ చేసారు... దీంతో గెలిచేంత బలం లేకపోయిన టిడిపి విజయం సాధించింది. ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే కూడా వున్నారని వైసిపి అదిష్టానం నిర్దారించింది. దీంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో మరో మేకపాటి బ్రదర్ రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. 

ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. జలదంకి
2. సీతారామపురం
3. ఉదయగిరి
4. వరికుంటపాడు 
5.  వింజమూరు
6. దుత్తలూరు 
7. కలిగిరి 
8. కొండాపురం 

ఉదయగిరి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,31,202
పురుషులు -   1,15,747
మహిళలు ‌-    1,15,440

ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన వైసిపి ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఉదయగిరి బరిలో నిలిపింది.     

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ ఈసారి ఉదయగిరిలో కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపింది. కాకర్ల సురేష్ ను ఉదయగిరి బరిలో దించింది టిడిపి.  

ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,85,933 (80 శాతం)

వైసిపి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి - 1,06,487 ఓట్లు (57 శాతం) - 36,528 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - బొల్లినేని వెంకట రామారావు - 69,959 ఓట్లు (37 శాతం) - ఓటమి

ఉదయగిరి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

టిడిపి - బొల్లినేని వెంకట రామారావు - 85,873 (48 శాతం) - 3,622 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి - 82,251 (46 శాతం) - ఓటమి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్