బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

By Aithagoni RajuFirst Published Jun 4, 2024, 9:24 AM IST
Highlights

కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన బద్వేల్‌లో ఈ సారి వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి విజయ జ్యోతి పోటీలో ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కాసేపట్లో తెలుస్తుంది.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది. తొలుత 1955 నుంచి 2004 వరకు బద్వేల్ జనరల్ నియోజకవర్గంగా వుండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ మూడు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలశపాడు, బీ కొండూర్, శ్రీ అవధూత కాశీనాయ, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, అట్లూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,740 మంది. వీరిలో పురుషులు 1,09,618 మంది.. మహిళలు 1,09,115 మంది. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గుణతోటి వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్‌కు 50,748 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 44,734 ఓట్ల మెజారిటీతో బద్వేల్‌ను కైవసం చేసుకుంది. అయితే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2021 మార్చి 28న మరణించారు. దీంతో బద్వేల్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలో దించగా.. టీడీపీ దూరంగా ఎన్నికలకు వుంది. బీజేపీ తరపున సురేష్ పోటీ చేశారు. సుధకు 1,12,211 ఓట్లు.. సురేష్‌కు 21,678 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉప ఎన్నికల్లోనూ వైసీపీ జయకేతనం ఎగరవేసింది. 

Latest Videos

బద్వేల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 

వైసీపీ బద్వేల్‌లో మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో జగన్‌ ఉన్నారు.  దివంగత సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ కేటాయించారు. సుబ్బయ్య సతీమణి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధ మరోసారి పోటీ చేశారు. ఈ సారి టీడీపీ కూడా విజయం సాధించాలని కసితో ఉంది. కానీ కూటమిలో భాగంగా ఈ సారి బీజేపీకి అవకాశం ఇచ్చారు.బీజేపీ నుంచి బొజ్జ రోషన్న పోటీ చేశారు. కాంగ్రెస్‌నుంచి విజయ జ్యోతి బరిలో ఉన్నారు. వీరిలో విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో క్లారిటీ రానుంది. 

click me!