
ఎన్టీఆర్ జిల్లా (ntr district) కంచికచర్లలో (kanchikacherla) గంజాయి మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మత్తులో ఒకరుపై మరోకరు దాడి చేసుకొవడంతో గోపి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇతనిపై విచక్షణా రహితంగా బ్లేడ్‌తో దాడి చేశాడు మరో వ్యక్తి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దు వ్యక్తులు 450 రూపాయల కోసం దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరు గతంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టబడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.