కర్నూల్ లో భారీ వర్షాలు: వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

By narsimha lodeFirst Published Sep 13, 2020, 11:35 AM IST
Highlights

కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్నూల్ జిల్లాలో వాగులో బైక్ తో పాటు ఇద్దరు యువకులు వాగులో కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడారు.

కర్నూల్ : కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్నూల్ జిల్లాలో వాగులో బైక్ తో పాటు ఇద్దరు యువకులు వాగులో కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడారు.

రెండు  రోజులుగా కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని  చిన్న కమ్మలూరు, యల్లావత్తుల మధ్య రోడ్డుపై నుండి వాగు నీరు ప్రవహిస్తోంది. 

వాగును దాటేందుకు చాలా మంది భయపడ్డారు. కానీ ఇద్దరు యువకులు వాగును దాటే ప్రయత్నంలో కొట్టుకుపోయారు. బైక్ ను నీటిలో తోసుకొంటూ  ఇద్దరు యువకులు వాగును దాటే ప్రయత్నం చేశారు. కొన్ని క్షణాల్లో వాగును దాటేవారు. కానీ ఆ సమయంలోనే వాగు ఉధృతికి బైక్ తో పాటు ఆ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు.

వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు హెచ్చరించినా కూడ యువకులు వినలేదు. యువకులు కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడారు. 

కడప జిల్లాలో కూడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలు చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలకు వరద పోటెత్తింది. ఇంకా 24 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

click me!