కోటంరెడ్డి, 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: ఆ ముగ్గురిపై సెషన్ పూర్తయ్యే వరకు వేటు

By narsimha lode  |  First Published Mar 15, 2023, 2:02 PM IST

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు  పయ్యావుల  కేశవ్ , నిమ్మల రామానాయుడులను  సస్పెండ్  చేశారు. 



 అమరావతి:  ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నుండి  12 మంది  టీడీపీ ఎమ్మెల్యేలను  సభ నుండి   బుధవారం నాడు  సస్పెండ్  చేశారు. మరో వైపు వైసీపీ రెబెల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కూడా సస్పెన్షన్ వేటు  పడింది.   టీడీపీ ఎమ్మెల్యేల్లో  పయ్యావుల కేశవ్,  నిమ్మల రామానాయుడు, వైసీపీ రెబల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను  ఈ శాసనసభ సమావేశాలు పూర్తయ్యేవరకు  సస్పెన్షన్  విధించారు.  మిగిలిన  టీడీపీ ఎమ్మెల్యేలను  ఇవాళ  ఒక్క  రోజే  సభ నుండి  సస్పెండ్  చేశారు.  

నిన్న  ఏపీ అసెంబ్లీ సమావేశాలను  ప్రారంభించేందుకు  గవర్నర్ వచ్చిన సమయంలో  సీఎం సమయానికి రాలేదని   టీడీపీ  సభ్యులు చేసిన వ్యాఖ్యలపై  అధికారపక్షం శాసనసభలో  ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టింది.  గవర్నర్ ను  ఐదు  నిమిషాల పాటు   స్పీకర్ చాంబర్ లో  కూర్చోవాల్సి వచ్చిందని   పయ్యావుల కేశవ్  ఆరోపించారు.తన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్  సభలో కూడా  సమర్ధించుకున్నారు.  దీంతో  ప్రివిలేజ్ మోషన్ ను  ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రవేశ పెట్టారు.   శాసనసభ నుండి  పయ్యావుల కేశవ్ తో పాటు  అతనికి  మద్దతుగా  సభలో  ఆందోళన నిర్వహించిన  నిమ్మల రామానాయుడును  సభ నుండి సస్పెండ్  చేశారు స్పీకర్ .  సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులను  సభ నుండి బయటకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు.  అయితే అదే సమయంలో  పయ్యావుల కేశవ్  పై  ప్రివిలేజ్ మోషన్ ను  ప్రవేశపెట్టడాన్ని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు.   

Latest Videos

undefined

పయ్యావుల  కేశవ్  పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడాన్ని  టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. ప్రభుత్వంపై నిరసనకు దిగారు.  సీఎం జగన్ కు వ్యతిరేకంగా  నినాదాలు  చేశారు.  పయ్యావుల కేశవ్ పై  ప్రివిలేజ్ మోషన్ ను వెనక్కి తీసుకోవాలని టీడీపీ సభ్యులు  స్పీకర్ పోడియం వద్ద నిలబడి  ఆందోళన చేశారు.  టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో  కూర్చోవాలని  స్పీకర్  కోరారు. పోడియం చుట్టుముట్టిన  టీడీపీ సభ్యులను కూడ సస్పెన్షన్ ను కోరుకుంటున్నారని   అధికారపార్టీ సభ్యులు ఆరోపించారు.  ఆందోళన చేస్తున్న  టీడీపీ సభ్యులను సస్పెండ్  చేయాలని  అధికార పార్టీ సభ్యులు కోరారు. స్పీకర్ పోడియం చుట్టు టీడీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సభలో  కొంతసేపు గందరగోళం  నెలకొంది.   సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలను సభ నుండి  బయటకు వెళ్లాలని  స్పీకర్ తమ్మినేని సీతారాం  ఆదేశించారు.సస్పెన్షన్ కు గురైన  టీడీపీ ఎమ్మెల్యేలను  అసెంబ్లీ నుండి  మార్షల్స్ బయటుకు తీసుకెళ్లారు. 

అనంతరం  వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   స్పీకర్ పోడియం వద్ద  నిరసనకు దిగారు. దీంతో   వైసీపీ  రెబల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని  ఈ సెషన్ పూర్తయ్యే వరకు  సస్పెండ్  చేస్తున్నట్టుగా  స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రకటించారు. 

also read:ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన: నమ్మక ద్రోహి అంటూ మంత్రుల మండిపాటు

సభలో  సభ్యులు  సస్పెన్షన్ కు గురైన  తర్వాత   స్పీకర్ తమ్మినేని  సీతారాం  సస్పెన్షన్ పై స్పష్టత ఇచ్చారు.  నిమ్మల రామానారాయుడు,  పయ్యావులకేశవ్, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను  శాసనసభ సమావేశాలు  పూర్తయ్యే వరకు  సస్పెండ్  చేస్తున్నట్టుగా  ప్రకటించారు.  మిగిలిని టీడీపీ సభ్యుల  సస్పెన్షన్ ఇవాళ  ఒక్క రోజేనని   స్పీకర్ వివరించారు. 

click me!