
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు టౌన్‌లో విషాద ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాలు.. తంగెళ్లముడికి చెందిన సిద్దూ(23), కొత్తపేటకు చెందిన భరత్(25), పవన్‌లు గతరాత్రి ఏలూరు బస్టాండ్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై మద్యం సేవించారు. ఆ మత్తులో తాము ట్రాక్స్ పై ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయారు.
దీంతో రైలు వస్తున్నా వారికి తెలియలేదు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురూ రైలు వస్తున్నా ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో.. రైలు వారిపై నుంచి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో భరత్, సిద్దూలు మరణించగా పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.