తిరుమలలో యాత్రికుల కోసం మరో రెండు కొత్త యాత్రికుల వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు తీర్మానించింది.
తిరుపతి : తిరుమలలో మరో రెండు కొత్త యాత్రికుల వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ ట్రస్ట్‌బోర్డు నిర్ణయించింది. తిరుమలలో మంగళవారం భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త టీటీడీ ట్రస్ట్‌బోర్డు తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 20 వేల మంది భక్తులకు సరిపడా రెండు పెద్ద యాత్రికుల వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. 600 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ వసతి సముదాయాల్లో కొత్త సౌకర్యాలు ఉండనున్నాయి.
దీనిమీద భూమన మాట్లాడుతూ.. ‘నేను గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో మొదటి చౌల్ట్రీని కూల్చివేసి విష్ణు నివాసం కాంప్లెక్స్‌ను నిర్మించాం. ఇప్పుడు రెండు, మూడో చౌల్ట్రీలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త యాత్రికుల సౌకర్యాల సముదాయాలను నిర్మించబోతున్నాం’ అని బోర్డు సమావేశం అనంతరం తెలిపారు.
undefined
ఏపీలో టీడీపీ బంద్.. పలువురు నేతల గృహ నిర్బంధం, అరెస్ట్‌లు.. కొనసాగుతున్న 144 సెక్షన్..
దీంతోపాటు తిరుపతి ట్రస్ట్ ముంబైలోని బాంద్రాలో కూడా నిర్మాణాలు చేపట్టనుంది. దేవాలయం, సమాచార కేంద్రం నిర్మాణం, స్థాపన కోసం 6.5 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. తిరుపతిలోని ఉద్యోగుల క్వార్టర్లను పునరుద్ధరించేందుకు 49.5 కోట్లు, వడమాలపేట సమీపంలోని ఉద్యోగుల కోసం ప్రతిపాదిత ఇళ్ల స్థలాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 33 కోట్లు కేటాయించాలని తీర్మానించారు.
తిరుపతిలో ఎంప్లాయిస్ కాలనీలు ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం టీటీడీ 4.15 కోట్లు కేటాయించింది. కొత్త ట్రస్ట్ బోర్డు ఆమోదించిన ఇతర కీలక తీర్మానాలలో కొత్తగా నిర్మించిన దేవాలయాలలో 413 మతపరమైన పోస్టులను ఏర్పాటు చేయడం, శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రిలో పని చేయడానికి నిపుణులైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో సహా 300 మంది సిబ్బందిని నియమించడం, అన్ని వేదపాఠశాలలలో 47 ఉపాధ్యాయుల పోస్టులు ఉండేలా చూడడం.
సనాతన ధర్మ ప్రచారం కోసం..
సనాతన ధర్మాన్ని, శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆలయ ట్రస్ట్ సంకల్పించిందని భూమన తెలిపారు. ఆ దిశలో తొలి అడుగుగా, 'శ్రీనివాస' నామ కోటి వ్రాసే పనిని పూర్తి చేసిన భక్తుల కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఇది సేమ్ ప్రసిద్ధి చెందిన రామకోటి లాగానే రాసే పద్ధతే. కోటిసార్లు ‘శ్రీనివాస’ నామాన్ని రాయడమే.