ఏపీలో అమిత్ గార్గ్ తో సహా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు..

By SumaBala BukkaFirst Published Dec 31, 2022, 2:04 PM IST
Highlights

ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లు పదోన్నతులు పొందారు. 1993 బ్యాచ్ ఐసీఎస్ లకు డీజీపీ ర్యాంకులు ఇచ్చింది ప్రభుత్వం. 

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు లభించాయి. పి.వి.సునీల్‌కుమార్ స‌హా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల‌కు డీజీపీ ర్యాంకులు ఇచ్చారు. మ‌హేష్ దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌, పి.వి.సునీల్‌కుమార్‌ల‌కు డీజీపీ ర్యాంకులు ఖ‌రారయ్యాయి. పి.వి.సునీల్‌కుమార్‌ డీజీపీ ర్యాంకులో సీఐడీ చీఫ్‌గా ప‌నిచేయ‌నున్నారు. మ‌హేష్ దీక్షిత్‌, అమిత్‌గార్గ్‌ లు ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం డిప్యూటేష‌న్‌లో ఉన్నారు.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో నాగులాపల్లి శ్రీకాంత్, ఎంకే మీనా, బి. శ్రీధర్ లు ముఖ్య కార్యదర్శి హోదాలు పొందారు. రేవు ముత్యాలరాజు, బసంత్ కుమార్ సెక్రటరీ హోదా పొందారు. జాయింట్ సెక్రటరీ హోదాలో సుమిత్ కుమార్, వెట్రిసెల్వీ, నిషాంత్ కుమార్, మాధవీ లత,  క్రైస్ట్ కిషోర్ కుమార్, గౌతమి, ప్రశాంతి, విజయ సునీత, అరుణ్ బాబు శ్రీనివాసులు పదోన్నతులు పొందారు.

2023లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అదే పని.. : మంత్రి జోగి రమేష్

ఇక అడిషనల్ సెక్రటరీ హోదాలో నారాయణ్ భరత్ గుప్తా, జే.నివాస్, గంధం చంద్రుడు, నాగరాణి ఉన్నారు. జాయింట్ కలెక్టర్ హోదాలో సూర్యసాయి ప్రవీణ్ చంద్, భావన, అభిషేక్, అపరాజిత సింగ్, విష్ణు చరణ్, నిధి మీనన్,  సింహాచలం, వికాశ్ మర్మత్ ఉన్నారు. సీనియర్ ఎస్పీ హోదాలో విజయరావు, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్నిలు ప్రమోషన్లు పొందారు. 

click me!